అయ్యా మా గోడు వినండి గ్రామ సర్పంచులుఆవేదనమధిర రూరల్ జనవరి 29 ప్రజాపాలన

Published: Monday January 30, 2023
 ప్రతినిధి మండలం పరిధిలో సర్పంచ్ సైదుల్లాపురం గ్రామం చిట్టిబాబు గ్రామ సర్పంచుల ఆవేదనతో తెలంగాణ ఏర్పడిన ఇన్ని సంవత్సరాలు అవుతున్న బాగుపడని అన్నదాత బతుకులుకనీసం ఆరు గంటలు కరెంటు ఇవ్వలేని ప్రభుత్వందేశంలో తెలంగాణ అభివృద్ధి పథంలో పైనుస్తుందని చెబుతున్న నాయకులు రైతుల గోషా పట్టించుకునేవారు లేరారైతుల సమస్యలను పరిష్కరించబోతే ఉద్యమాలకు సిద్ధమంటున్న అన్నదాతలుసైదల్లిపురం సర్పంచ్ చిట్టిబాబుతెలంగాణ ఏర్పడి 15 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ తెలంగాణాలో అన్నదాత జీవితాలను బాగు చేయని ప్రభుత్వం దేశంలో తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు అన్ని విధాలుగా ఆదుకుంటుందని గొప్పలు చెప్పడం విడ్డూరంగా ఉందని సైదల్లిపురం సర్పంచ్ చిట్టిబాబు పేర్కొన్నారు.
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు స్వచ్ఛమైన 24 గంటల ఉచిత కరెంటు అందజేస్తామని వాగ్దానాలు చేసినప్పటికీ కనీసం 6 గంటలు కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి రైతులు ఎదుర్కొంటున్నారని ఇలాంటి పరిస్థితులతో అన్నదాత పంట పండించడం చాలా కష్టపరంగా మారిందని పంటకు నీరు అందక పంట నాశనం అయిపోతుందని కన్నదాత కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితులు తెలంగాణలో ఉన్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని ఇప్పటికైనా వాగ్దానాలు ఆపి చేసిన వాగ్దానాలు అమ్ములు చేయాలని అన్నారు.
కరెంటు విషయమై గ్రామ రైతులు సంబంధిత అధికారులకు చరవాణిలో సంప్రదించగా మాకే తెలియని విషయం మీకు ఎలా చెప్తాము మాకు తెలిస్తే చెప్తాము అని హాస్యాస్పదంగా చెప్పడం పాలకుల పనితీరు పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.మొక్కజొన్నలు మిరప తోటలు ఎండిపోతున్నాయి తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే కరెంటు బి ఆర్ ఎస్ పార్టీ ఇచ్చే విధంగా ఇవ్వటం లేదని ఘనంగా చెప్పుకుంటున్నారు కానీ ప్రస్తుతం 24 గంటలు పక్కనపెట్టి కనీసం ఆరు గంటలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంది రైతు లు 24 గంటలు త్రీఫేస్ ఉంటుందని దానిమీద ఆధారపడి పంటలు వేసి నీళ్లు లేక కరెంటు రాక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంది కావున ఇకనైనా ప్రజాప్రతినిధులు మేల్కొని రోజుకి రాత్రిపూట ఇవ్వకపోయినా పర్వాలేదు పగటిపూట 12 గంటలు ఇవ్వాలని రైతులందరూ కోరుకుంటున్నారు లేకపోతే ఇదే పరిస్థితి ఉంటే త్వరలో కరెంటు సబ్ స్టేషన్ ముందు రైతులు అందరూ వచ్చి ధర్నా చేసి రాస్తారోకోలు చేయాల్సి వస్తుంది.