గిరిజన సంప్రదాయ పండుగ తీజ్ : ఎంపీపీ నర్మద లచ్చిరాం నాయక్

Published: Thursday September 09, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 8, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని మంచాల మండలం బోడకొండ గ్రామంలో లంబాడీల పవిత్ర సాంప్రదాయ తీజ్ పండుగ ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీపీ నర్మదా లచ్చిరాం నాయక్ మాట్లాడుతూ "లంబాడి జాతి వళ్ళని బంజారా లుగా పిలుస్తారని, భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి లంబాడీలు మాట్లాడే ఒకే భాష అని, ఈ పవిత్రమైన తీజ్ పండుగను 11 రోజులు జరుపుకుంటామని తెలిపారు. ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఒక పందిరి పైన గోధుమలు, మట్టిని ఓ బుట్టలో తీసుకొని 11రోజులు ఉంచుతారాని తెలిపారు. గ్రామ కశ్రం నాయక్ మాట్లాడుతూ "శివలాల్ మహారాజ్ తమ కుల గురువు అని, అతని తల్లి అయిన మరియమ్మ  యాడి  ఆదేశాల ప్రకారం లంబాడి జాతి వాళ్ళు అందరూ సుఖసంతోషాలతో, ధనధాన్యాలతో వర్ధిల్లాలని తీజ్ పండుగను ప్రారంభించారు. పెళ్లికాని అమ్మాయిలు ఉపవాస దీక్షతో దీని 11 రోజులు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాన్య నాయక్, లచ్చి రామ్ నాయక్, శ్రీధర్ నాయక్, కే బాల్ రామ్, తదితరులు పాల్గొన్నారు.