పరిశుద్ధ కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంపీడీవో శ్రీదేవి

Published: Tuesday June 29, 2021
బోనకల్లు, జూన్ 28, ప్రజాపాలన ప్రతినిధి : ఆళ్లపాడు గ్రామంలో పరిశుద్ధ కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న ఎంపీడీవో శ్రీదేవి గారు గ్రామంలో జరుగుతున్నటువంటి సైడ్ కాలవలు పూడికతీత రోడ్లు డ్రైనేజీలు పైపులు ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న కాలువల్లో పూడిక తీత నిమగ్నమై చేస్తున్నటువంటి కార్యక్రమలు ప్రజలకు అనుకూలమైన విధంగా ఉండాలని వర్షపు నీరు నిల్వ లేకుండా ఉండాలని ఎక్కడైనా వర్షపు నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని గ్రామ ప్రజలకు సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది గ్రామంలో కరోనా కేసులు నిరంతరం కరోనా టేస్టులు చేయటం జరుగుతుంది ప్రస్తుతం 10 కేసులు ఉన్నందున వారిని అబ్జర్వేషన్లో ఉంచి వారికి కావలసిన జాగ్రత్తలు పాటించాలని వారికి సూచనలు సలహాలు ఇస్తూ కరోనా పట్ల జాగ్రత్తగా ఉండాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సామాజిక దూరం పాటించాలని వర్షాకాలం అయినందున వర్షాకాలంలో ప్రజలంతా నీటి గుంటలు మురుగు నీటి నిల్వల పై అవగాహన కల్పించుకొని మురుగు నీరు లేకుండా చేసుకోవాలని గ్రామ ప్రజలకు తెలియజేశారు గ్రామంలో చెత్తాచెదారం లేకుండా పరిశుభ్రంగా ఉంచాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పరాశురాం anm తిరుపతమ్మ ఆశా కార్యకర్తలు కళావతి రత్నకుమారి సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు