జాతీయ స్థాయి ఉగాది పురస్కారం

Published: Monday April 05, 2021

వలిగొండ ప్రజా పాలన ప్రతినిధి మండల పరిధిలోని వేములకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చెందిన ఆరోగ్య పర్యవేక్షకులు నాశబోయిన నరసింహ నాన్న కు తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణానికి చెందిన శ్రీగౌతమేశ్వర సాహితీ కళా సేవ సంస్థ, కవితల కోవెల కళావేదిక, ఎస్వీ ఆర్ స్టూడియోస్ వారు ఏప్రిల్ 4 ఆదివారం రోజున నరసింహకు సాహితీ కిరణం అవార్డుతో పాటు సాహిత్యరంగంలో జాతీయస్థాయి ఉగాది పురస్కారం 2021 అందజేశారు. రెండు దశాబ్దాలుగా ఆయన సాహితీ సేవలో చేస్తున్న విశిష్ట కృషిని గుర్తించి ఈ జాతీయ స్థాయి ఉగాది పురస్కారం ఆ సంస్థ అధ్యక్షుడు దూడపాక శ్రీధర్, ఉపాధ్యక్షుడు ఎస్వీఆర్ వెంకటేష్, తెలంగాణ పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ శ్రీ ఉప్పల శ్రీనివాస్ గుప్త, పెద్దపల్లి జిల్లాపరిషత్ చైర్మన్ శ్రీ పుట్ట మధు, వైరాగ్యం ప్రభాకర్ మొదలైన సాహితీవేత్తలు రాజకీయ ప్రముఖుల సమక్షంలో మంథనిలో జరిగిన జాతీయ స్థాయి సాహిత్య సభలో ఈ పురస్కారం అందజేశారు. వృత్తిపరంగా నరసింహ వైద్య ఆరోగ్య రంగంలో ఆరోగ్య పర్యవేక్షకుడిగా పని చేస్తూ, ప్రవృత్తిగా సాహితీ రచనలు చేస్తూ సమాజ హితం కోసం తను చేస్తున్న కృషిని గుర్తిస్తూ ఈ ఏడాది జనవరిలో పుడమి సాహితీ సంస్థ నల్గొండ వారు పుడమిరత్న అవార్డు, ఫిబ్రవరిలో విజయవాడకు చెందిన వాగ్దేవి కళాపీఠం వారు కవిరత్న అవార్డు, ఏకె తెలుగు మీడియా ముంబై వారిచే ఆన్లైన్ వేదిక ద్వారా తెలంగాణ సాహిత్య రత్న అవార్డు పొందారు.వీరి రచనలు తరచుగా వివిధ దిన, వార, మాస పత్రికలలో వెబ్ మేగజైన్ లలో ప్రచురింపబడు తుంటాయి. ఈ సందర్భంగా నరసింహకు సాహితీకిరణం బిరుదుతో పాటు జాతీయ స్థాయి ఉగాది పురస్కారం రావడం పట్ల పలువురు సాహితీ మిత్రులు, తోటి వైద్యఆరోగ్య శాఖ ఉద్యోగులు, శ్రేయోభిలాషులు పలువురు ఆయనను అభినందించారు.