ఉపాధి హామీ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి

Published: Saturday March 26, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 25 ప్రజాపాలన ప్రతినిధి : ఈరోజు కుర్మిద్ద గ్రామంలో ఉపాధికూలీల సమస్యలు తెల్సు కోవడం జరిగింది ఈ సందర్బంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పి అంజయ్య  మాట్లాడుతూ. ఈ గ్రామంలో సుమారుగా 100 మంది వరకు 6 నుండి 8 వారాల వరకు పనిచేసిన కూలీలకు డబ్బులు ఇవ్వక పోవడం సిగ్గు చేటు కూలీలలు ఎర్రటి ఎండలో పని చేస్తే సకాలంలో డబ్బులురాక పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు తట్టుకోలేక రోజువారీ అవసరాలు తీరక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే పెండింగ్ బిల్లులు విడుదల చేయాలి 2 గంటల వరకు పనిచేయాలనే నిబంధన తీసివేయాలి ఉదయం పూట మాత్రమే పని కల్పించాలి ఫార్మాసిటీ తీసుకున్న భూములల్లో పని కల్పించాలి పెరుగుతున్న ధరలకు అనుగుణంగా రోజు కూలీ 600 రూపాయలు ఇయ్యాలి. సంవత్సరానికి 200రోజులు పని కల్పించాలి. పేస్లిప్పులు ఇవ్వాలి. మెడికల్ కిట్టు అందు బాటులో ఉండాలి. మేట్లకు పారి తోసికం 6 రూపాయలు ఇయ్యాలి. పనిముట్లు గడ్డపార. తట్ట. పార. ప్రతి కుటుంబానికి ఇవ్వాలి. మస్టర్ తెలుగులో ఇంటి పేరుతో ఉండాలి. దరఖాస్తు చేసుకున్న ప్రతి కూలికి రషీదు ఇవ్వాలి. కూలీలపట్ల ప్రభుత్వ తీరు మార్చుకొని వారి సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ సందర్భంగా ప్రభుత్వన్ని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం మండల నాయకులు ఎం జంగయ్య టిఎ.మాణిక్యం. ప్రభూ. ఆంజనేయ. తదితరులు పాల్గొన్నారు అనంతరం కూలీలా కమిటీ వేయడం  జరిగింది అధ్యక్షులు. ఎం బాలమ్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యదర్శిగా పి కృష్ణ. సహాయ కార్య దర్శకులుగా దండే పద్మ తెలుగామల్ల శేఖర్ ఉపాధ్యక్షులుగా జక్కుల కవిత మూలి పుష్ప కమిటీ సభ్యులు పి వజ్రమ్మ ఎం సత్తయ్య బాలమణి ఎన్ జయరాములు పి చెన్నయ్య శ్రీనివాస్ వెంకటయ్య తదితరులు ఉన్నారు.