పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం

Published: Friday October 28, 2022
షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం
వికారాబాద్ బ్యూరో 27 అక్టోబర్ ప్రజా పాలన : పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోనుటకు గడువు పొడగించనైనదని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి యన్. మల్లేశం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 
                                                        2022-23 విద్యా సంవత్సరములో వివిధ కళాశాలలో వివిధ కోర్సులలో విద్యనభ్యసిస్తున్న షెడ్యూల్డ్ కులాల విద్యార్ధులలో అర్హత కలిగిన విద్యార్థులు (ఫ్రెష్, రెన్యువల్) ఉపకార వేతనాలు (ట్యూషన్ ఫీజు, మెయింటెనెన్స్ చార్జీలు) పొందేందుకు తమ దరఖాస్తుల వివరాలు ఈ-పాస్ http://telanganaepass.cgg.gov.in నందు అప్ లోడ్ చేసి రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం ఒక ప్రకటనలో తెలియజేశారు.  అర్హులైన షెడ్యూల్డ్ కులాలకు చెందిన కళాశాల విద్యార్ధులు అందరూ ఈ అవకాశం  వినియోగించుకోగలరని, సదరు కళాశాలల ప్రిన్సిపాల్స్ తమ విద్యార్ధులకు ఇట్టి సమాచారం అందజేసి వారిచే ఈ- పాస్ వెబ్ సైట్ నందు ఉపకార వేతనాల నమోదు కొరకు 2023 జనవరి 31వ తేదీ వరకు పోడిగించనైనదని అయన తెలిపారు.  కళాశాలల ప్రిన్సిపాల్స్, యాజమాన్యాల వారు తమ కళాశాలలో చదువుచున్న విద్యార్థులను రిజిస్ట్రేషన్ చేసుకునే విధంగా  చూడాలని తదుపరి గడువు పొడగించే అవకాశం లేనందున  అర్హులైన విద్యార్థులు అందరు రిజిస్టర్ చేసుకోవాలని జిల్లా  షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి అధికారి మల్లేశం తెలిపారు.