భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ను సూపర్ ఫాస్ట్ రైలుగా నడిపించాలి

Published: Saturday December 17, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి:  సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్నగర్ వరకు నడుస్తున్న భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ రైలు ను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ గా నడిపించాలని బెల్లంపల్లి మర్చంట్ అసోసియేషన్ ప్రతినిధి కొలిపాక శ్రీనివాస్ దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ కు పంపిన వినతి పత్రంలో  విజ్ఞప్తి చేశారు.
 ఈ సందర్భంగా ఆయన శుక్రవారం పత్రికల వారితో మాట్లాడారు, భాగ్యనగర్  రైలు ను  సిర్పూర్ కాగజనగర్ నుంచి నాలుగు గంటలకు బదులుగా 5గంటలకు బయలుదేరి సికింద్రాబాద్ కీ 10గంటలకు వెళ్లేలా సూపర్ ఫాస్ట్ గా నడపాలని కోరారు, కోవిడ్  వల్ల స్టాపింగ్ తీసేసిన   దక్షిన్, నాగపూర్, ఏపీ సంపర్క్ క్రాంతి,  గ్రాండ్ ట్రంక్ సూపర్ ఫాస్ట్ రైల్ల స్టాపింగ్ ను, యధా విధిగా స్థాపింగ్స్ ఇస్తూ ,     నవజీవన్, కేరళ,రైళ్లు ఆగేలా, బెల్లంపల్లి నుండి తిరుపతికి ప్రత్యేక రైలును మంజూరు చేయాలని, ఉత్తర జిల్లాలైన కరీంనగర్, పెద్దపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, భూపాలపల్లి, జగిత్యాల జిల్లాలలోని ప్రజల కోసం సిర్పూర్ కాగజ్నగర్ నుంచి ప్రతి రోజు వయా కాచిగూడ మీదుగా రైలు నడపాలని విజ్ఞప్తి చేశారు.
  పార్లమెంట్ సమావేశాల్లో  పెద్దపల్లి ఎంపీ  వెంకటేష్ నేత,  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ,   మేడ్చెల్ -మల్కాజిగిరి  ఎంపీ  రేవంత్ రెడ్డి, మరియు సికింద్రాబాద్ నుంచి ఎంపి కేంద్ర మంత్రి  గా కొనసాగుతున్న  కిషన్ రెడ్డీ లు  పార్లమెంట్ సమావేశాల్లో 
 బెల్లంపల్లి రైలు సమస్యల పై స్పందించాలని విజ్ఞప్తి చేశారు.