వట్టి వాగు కాలువ పూడిత తీయించాలి కలెక్టరేట్ ఎదుట రైతుల ధర్నా

Published: Friday July 22, 2022

ఆసిఫాబాద్ జిల్లా జూలై20 (ప్రజాపాలన, ప్రతినిధి) : మండలంలోని వట్టి వాగు కాలువలో మట్టి పేరుకుపోవడంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు రావడం లేదని ఆయకట్టు దారులు ఎంపీపీ అరిగేల మల్లికార్జున్ తో కలిసి బుధవారం ఇరిగేషన్ కార్యాలయాన్ని ముట్టడించి అక్కడి నుండి ర్యాలీగా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  అధికారులు గత సంవత్సరం వట్టి వాగు కాలువలోని మట్టి పూడిక తీస్తూ ఒక చోట తీర్చాలని దీంతో నీళ్లు రావడం లేదన్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన ఆలోచించి భూముల్లో వరి పంట వేయలేదని  కారణం అధికారుల నిర్లక్ష్యమే అని ఆరోపించారు. కాలువలలో పేరుకుపోయిన మట్టిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు.లేనియెడల ఉద్యమాన్ని చేస్తామని హెచ్చరించారు.ధర్నా కార్యక్రమంలో అప్ప పెళ్లి సర్పంచ్ బాబురావు, సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ ఆహ్మద్, గంధం శ్రీనివాస్, సర్పంచ్ భీమేష్, రైతులు పాల్గొన్నారు.