లాక్డౌన్ కాలంలో పేదలను ఆదుకోవాలి : నల్లా నాగేంద్ర ప్రసాద్

Published: Friday May 21, 2021

మంచిర్యల, మే20, ప్రజాపాలన ప్రతినిధి : లాక్డౌన్ కాలంలో పేదలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విదాలుగా ఆదుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్లా నాగేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కరోనా కేసులు అత్యధికంగా పెరగడం, మరణాలు కూడా అత్యధికంగా సంభవించడాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కరోనా చైన్ సిస్టం బ్రేక్ చేయాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ విదించినట్టు గుర్తు చేశారు. ఐతే ప్రభుత్వం ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల వలస కూలీలు, పెద ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. లాక్ డౌన్ కు ముందు కనీసం ముందస్తుగా ప్రజలకు సమాచారం ఇవ్వకపోవడం , తిరిగి మరో పదిరోజులు లాక్ డౌన్ పోడగించడం ప్రజలను ఆర్థికంగా , మరిన్ని వ్యక్తి గతమైన  సమస్యల్లో పడేసినట్లు అయ్యిందని అన్నారు. గతంలో లాగ లాక్ డౌన సమయంలో  నిత్యావసర సరుకులు , నగదును అందించా‌ని డిమాండ్ చేశారు. ఈ లాక్డౌన్ మూలన ఉపాధి కోల్పోయి తినడానికి తిండి లేక నిత్యావసర సరుకులు తెచ్చుకుందాం అంటే డబ్బులు లేక రాష్ట్రంలో కొన్ని లక్షల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మొండి నిద్రలో నుండి మేలుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబలని దృష్టిలో పెట్టుకొని ఈ కష్ట కాలంలో వారికి అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత  ఎంతైనా ఉందని పేర్కొన్నారు.