వెల్వర్తి ఉపసర్పంచ్ పై అవిశ్వాసం రద్దు

Published: Tuesday May 04, 2021
వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల పరిధిలోని వెల్వర్తి గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ తక్కెళ్ల  శ్రావణి పై గ్రామానికి చెందిన కొంత మంది వార్డు సభ్యులు గతంలో జిల్లా కలెక్టర్ కు పిర్యాదు చేయడంతో వారి ఆదేశాల మేరకు చౌటుప్పల్ ఆర్ డి ఓ సూరజ్ కుమార్ సోమవారం గ్రామపంచాయతీలో అవిశ్వాస తీర్మానం ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 1వ తేదీ శనివారం హైకోర్టు ఇచ్చిన స్టే ఉత్తర్వుల ప్రకారం ఉపసర్పంచ్ పై అవిశ్వాస తీర్మానాన్ని నిలిపి వేస్తున్నట్లు ఆర్డీఓ సూరజ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.