టీబీ వ్యాధి నిర్మూలన మనందరి బాధ్యత.. ఆసుపత్రి సూపర్వైజర్ పెద్ద పుల్లయ్య..

Published: Tuesday November 22, 2022
 తల్లాడ, నవంబర్ 21 (ప్రజా పాలన న్యూస్): టీబీ వ్యాధి నియంత్రణ మనందరి బాధ్యతని టీబీ నోడల్ పర్సన్ పెద్దపుల్లయ్య అన్నారు. సోమవారం తల్లాడ ప్రాథమిక ఆరోగ్యకేంద్రం పరిధిలో డాక్టర్ నవ్యకాంత్ ఆధ్వర్యంలో జిల్లా టీబీ నియంత్రణ అధికారి డాక్టర్ సుబ్బారావు ఆదేశాల మేరకు గూడూరులో టీబీ వ్యాధికల్లె నమూనాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ
రెండు వారాల నుంచి కల్లెతో కూడిన దగ్గు రావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం కళ్ళేలోరక్తం పడటం
సాయంత్రం సమయంలో చెమటలు పట్టడం, జ్వరం రావడం, అలసట నీరసంగా ఉండడంపై లక్షణాలు కనిపించినట్లయితే దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సురేష్, గ్రామ టీబీ ల్యాబ్ సూపర్వైజర్ సంజీవ్ కుమార్, పంచాయతీ సెక్రెటరీ, ఆశ కార్యకర్త ప్రమీల పాల్గొన్నారు.