బిజెపిలో పలు కుటుంబాలు చేరిక

Published: Saturday December 03, 2022

బోనకల్, డిసెంబర్ 2 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధి లోని ఆళ్లపాడు గ్రామంలో పలు కుటుంబాలు బిజెపి పార్టీలోకి చేరారు. గ్రామ అధ్యక్షులు డివిఆర్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రామ కమిటీ సమావేశంలో ముఖ్య అతిథులుగా ఎస్టీ మోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ యువనేత బీపీ నాయక్, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు తాళ్లూరి సురేష్, ఓబిసి మోర్చా జిల్లా కార్యదర్శి జంపాల రవి లు హాజరయ్యారు. రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ గా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారిగా ఆళ్లపాడు గ్రామానికి విచ్చేసిన బీపీ నాయక్ ను గ్రామ కమిటీ స్వాగతం పలికి సత్కరించారు. అనంతరం బీపీ నాయక్ పలు కుటుంబాలను పార్టీ కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. తదనంతరం గ్రామ కమిటీ పొందుపరిచిన పలు అంశాలను చర్చిస్తూ, రాబోయే ఎన్నికలలో భారత జనతా పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి బూత్ కమిటీలు చాలా ముఖ్యమని వాటిని మరింత బలోపేతం చేయాలని దిశా నిర్దేశం చేశారు.రాష్ట్ర కమిటీ ప్రణాళికలను కార్యకర్తలకు నాయకులకు వివరించి వారిలో నూతన ఉత్సాహన్ని నింపారు. ఈ కార్యక్రమంలో యువ మోర్చా మండల అధ్యక్షులు కలసాని పరశురాం, ఓబిసి మోర్చా మండల అధ్యక్షులు మరీదు పరశురాముడు,మహిళా మోర్చా మండల అధ్యక్షురాలు మంద రాజ్యం, కిసాన్ మోర్చా మండల నాయకులు సురేష్, మైనార్టీ మోర్చా నాయకులు హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.