డిప్యూటేషన్ పై కోచ్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.

Published: Saturday March 20, 2021
జిల్లా యువజన, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి
 
మంచిర్యాల జిల్లా ప్రతినిధి, మార్చి 19, ప్రజాపాలన : జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ ఆదేశాల మేరకు స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ ఇండియా దీర్ఘకాలిక లక్ష్యాన్ని సాధించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ విభాగాలు / పి.ఎన్.యు.ల నుండి డిప్యూటేషన్ తో పాటు రుణ ప్రాతిపదికన (ఒక నిర్దిష్ట కాలానికి) డిప్యూటేషన్ పై అసిస్టెంట్ కోచ్, సీనియర్ కోచ్, చీఫ్ కోచ్లను నియమించడానికి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. లాస్ ఏంజిల్స్ (2028) ఒలంపిక్స్ లో మొదటి పది దేశాలలో, ఎన్.ఎ.ఐ. నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఈ.లు) నియమించబడిన టి.ఓ.పి. ఎన్. ఎన్.సి.ఓ.ఈ.లలో శిక్షణ పొందిన నాణ్యతను పెంచడానికి, ఆనక్తి గల క్రీడాకారులు ఈ నెల 31వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవచ్చని, అర్హత మార్గదర్శకాలు, ఫీజులు, పోన్టుల గురించి ఎన్.ఎ.ఐ. వెబ్ సైట్ www.sportsauthorityofindia.nic.in సంప్రదింవచ్చని, ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.