అత్వెల్లి గ్రామ అభివృద్ధే లక్ష్యం

Published: Tuesday June 07, 2022
సర్పంచ్ మోహన్, కార్యదర్శి కిషన్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 06 జూన్ ప్రజాపాలన : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతితో ప్రతి గ్రామం అభివృద్ధి చెందుతున్నదని అత్వెల్లి గ్రామ సర్పంచ్ మోహన్, కార్యదర్శి కిషన్ రెడ్డి సంయుక్తంగా తెలిపారు. సోమవారం వికారాబాద్ మండల పరిధిలోని అత్వెల్లి గ్రామంలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ భవనాలు, ఖాళీ స్థలాలు, వీధి రోడ్లు పరిశుభ్రత కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్వెల్లి గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు నిత్యం పల్లె ప్రగతి కార్యక్రమం చేపట్టడం జరిగిందని తెలిపారు. గ్రామంలో పాడుబడిన ఇండ్లను గుర్తించడం జరిగిందని, యజమానుల అనుమతితో వాటిని కూల్చి వేస్తామన్నారు. రోడ్డుకిరువైపులా మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అలాగే గ్రామంలో ఉన్న మురుగు కాలువలను శుభ్రం చేయిస్తూ, తమ ఇంటికి ప్రక్కన ఉన్న మురుగును తీసేయాలని ప్రజలకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారు.