రంగారెడ్డి జిల్లా సీపీయం పార్టీ మండల కమిటీ సభ్యుల వర్క్ షాప్ యాచారం మండలం చింతపట్ల గ్రామంలో

Published: Tuesday August 30, 2022

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సిపిఎం రాష్ట్ర  కార్యదర్శివర్గ  సభ్యులు జాన్ వెస్లీ  హాజరై పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి, ఈ సభలో ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ* దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మతోన్మాదాన్ని రెచ్చగొడితే ఇతర మతాల మీద దాడి చేస్తూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి మత చిచ్చులు పెడితే దేశాన్ని నాశనం చేస్తుంది అని అన్నారు. దళితుల మీద గిరిజనుల మీద మహిళల మీద మైనార్టీల మీద నిత్యం ఏదో రకంగా అత్యాచారాలు దాడులు జరుగుతున్నాయి అన్నారు.
నిత్యావసర ధరలు పెంచుతూ, బడా పెట్టుబడిదారులకు ఊడిగం చేస్తున్నారు అని అన్నారు.  అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ముందు ఆమె ఇచ్చిన టిఆర్ఎస్ ప్రభుత్వం భూ సమస్యలు పరిష్కరిస్తామని,  ఇళ్ల స్థలాలు డబల్ బెడ్ రూమ్ లు హామీలు ఎక్కడ అమలు కాలేదని చెప్పారు.  భవిష్యత్తులో భూ సమస్యల మీద ఇళ్ల స్థలాల మీద భూ సమస్యల మీద ధరణి సమస్యల మీద పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.  లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరించారు. జరగబోయే పోరాటాలలో ప్రజలు అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కడిగల్ల భాస్కర్
జిల్లా  కార్యదర్శివర్గ సభ్యులు మధుసూదన్ రెడ్డి, పగడాల యాదయ్య, N. రాజు,జిల్లా కమిటీ సభ్యులు,  శ్రీనివాస్ రెడ్డి, నరసింహ,జగన్, మల్లేష్,
కిషన్, అంజయ్య,రవికుమార్, శ్యామసుందర్, A. నరసింహ  జిల్లా పార్టీ వివిధ మండల కమిటీ  సభ్యులు, మండల కార్యదర్శి వర్గ సభ్యులు బ్రహ్మయ్య,జంగయ్య, చందు నాయక్,
p. వెంకటయ్య,  ఎం రమేష్,  చింతపట్ల పార్టీ గ్రామ శాఖ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.