దాతల సహాయం కోసం ఎదురుచూపు

Published: Wednesday November 16, 2022
చౌటుప్పల్, నవంబర్ 15 (ప్రజాపాలన ప్రతినిధి):చౌటుప్పల్ మండలం ఎస్.లింగోటం చెందిన పిట్టల తరుణ్ సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా,చికిత్స నిమిత్తం ఒక కాలును పూర్తిగా తీసివేయడం జరిగింది.సర్జరీ కోసం ఇంకా పది లక్షల రూపాయలు అవసరమవుతుండగా,నిరుపేద కుటుంబానికి చెందిన పిట్టల తరుణ్ ని ఆదుకోవాలని,దాతల సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.మానవత్వంతో స్పందించే దాతలు ఎవరైనా తండ్రి పిట్టల కుమార్ 9704752623 నంబరును సంప్రదించగలరని కోరుతున్నారు.