అంతర్ రాష్ట్ర డప్పు పోటీలో దూసుకుపోతున్న కలకోట సింధు డప్పు బృందం

Published: Monday June 06, 2022

బోనకల్, జూన్ 5 ప్రజా పాలన ప్రతినిధి :తప్పెట దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయి డప్పు విన్యాస పోటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా వినుకొండలో జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రం నుండి ఖమ్మం జిల్లా బోనకల్లు మండలానికి చెందిన కలకోట సింధు డప్పు కళాబృందం విజయ విన్యాసాన్ని ప్రదర్శిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం కాగా ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి కళాబృందాలు పోటీల్లో పాల్గొంటున్నాయి. వివిధ రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి పోటీలకు అందిన ఎంట్రీలను ప్రిలిమినరీ సెలక్షన్స్ ద్వారా ఎంపిక చేసి మెయిన్స్ లో పోటీల నిర్వహణ నిర్వహిస్తున్నారు. సింధు డప్పు కళాబృందం గత రెండు రోజుల నుంచి జ్యూరీ సభ్యుల ఎదుట డప్పు విన్యాసాలను ప్రదర్శిస్తుంది.ఈ బృందాన్ని కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ తోటపల్లి జీవన్ కుమార్ స్పాన్సర్ ద్వారా తమ ప్రతిభను అంతర్రాష్ట్ర వేదికల మీద కనబరిచే అవకాశం కల్పించినందుకు బృంద సభ్యులు సంతోషంగా వ్యక్తం చేశారు , వీరిని గైడ్ చేస్తూ అసోసియేట్ ప్రొఫెసర్ అమరయ్య ప్రత్యేక చొరవ తీసుకుని వారిని జెండా ఊపి పోటీలకు పంపించారు ఈ పోటీల్లో విజయం సాధించిన బృంద సభ్యులకు మెమంటో తో పాటు లక్ష రూపాయలు బహుమతి ప్రధానం చేస్తారు.