ఆదర్శ పాఠశాలకు కేర్ టేకర్ ఉద్యోగం కు దరఖాస్తు,

Published: Thursday February 03, 2022

ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ కే శ్రీనివాస్.
వెల్గటూర్, ఫిబ్రవరి 02 (ప్రజాపాలన ప్రతినిధి) : వెల్గటూర్ మండలం కుమ్మరి పల్లి ఆదర్శ పాఠశాలకు అనుబంధంగా నిర్వహించు బాలికల వసతి గృహాంలొ కేర్ టేకర్ ఉద్యోగం ఖాళీగా ఉందని ఇందుకోసం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు పాఠశాల ప్రిన్సిపాల్ కె.శ్రీనివాస్ బుధవారం రోజు ఒక ప్రకటనలో తెలియజేశారు. కేర్ టేకర్ ఈ ఉద్యోగం కోసం మహిళ అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ఏదైనా డిగ్రీ తో పాటు బీ.ఈ.డీ లేదా డి.ఎడ్ కలిగి ఉండాలి 25 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి అదేవిధంగా ఎస్.సి, ఎస్.టి, బి.సి అభ్యర్థులకు ఐదు సంవత్సరముల  వేలుసుబాటు ఉంటుందని ఆయన తెలిపారు. అనుభవం మరియు కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యత ఇవ్వబడును ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల తొమ్మిదో తేదీ  లోపు పాఠశాల యందు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్ శ్రీనివాస్ తెలియజేశారు.