పారదర్శకంగా అడ్మీషన్ల ప్రక్రియ అంటే రహస్యంగా అమ్ముకోవడం మా...? అంటూ యూనివర్సిటీ లో వెలసిన గోడ

Published: Monday November 22, 2021
హైదరాబాద్ 20 నవంబర్ ప్రజాపాలన ప్రతినిధి : జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం హైదరాబాద్ లో పి.హెచ్.డి. 2021 సంవత్సరం ప్రవేశంలో అవకతవకలు జరిగాయని వెలసిన గోడ పత్రికలు. పరిశోధన ప్రోగ్రామ్‌లలో ప్రవేశాల కోసం ఆన్‌లైన్ పద్దతి ద్వారా దరఖాస్తులు ఆహ్వానించి అభ్యర్థులను ఎంపిక చేయడం జరిగిన విషయం తెలిసిందే. పిహెచ్.డి. ఎంపికలో అవకతవకలు జరిగాయని న్యాయంగా సీటు రావాల్సిన విద్యార్థులకు అందలేదని, విద్యార్థులను ఎంపిక చేయడంలో పొరపాటు జరిగిందని విద్యార్థులు ఆరోపణలు ఎదుర్కొంటున్న యునివర్సిటీ. దీనిలో భాగంగా బుధవారం నాడు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో తమకు న్యాయం చేయాలని విద్యార్థులు ప్లే కార్డులతో యునివర్సిటీ వైస్ ఛాన్సలర్ కార్యాలయాన్ని ముట్టడించిన సంగతి విదితమే. ఆందోళన చేస్తున్న విద్యార్థులను సంబంధించిన పోలీసు అధికారులు అరెస్టు చేసి విడుదల చేయడం జరిగింది. న్యాయం కోసం వచ్చిన విద్యార్థులను అరెస్టు చేయడాన్ని విద్యార్థులు తీవ్రంగా ఖండించడం తెలిసినదే. ఇలా ఆందోళనలు చేస్తు ఉండగా శనివారం నాడు యునివర్సిటీ ఆవరణలో గోడ పత్రికలు వెలిశాయి. పి.హెచ్.డి విద్యార్థుల ఎంపిక అనేది ప్రతిభ ఆధారంగా పారదర్శకంగా ఉంటుంది. కాని ప్రతిభ ను తుంగలో తొక్కారు. 'ఎంపిక అనేది అభ్యర్థుల ప్రతిభను చూసి జరగాలి! నోట్ల కట్టలను బట్టి కాదు', 'పారదర్శకంగా అడ్మీషన్ల ప్రక్రియ అంటే రహస్యంగా అమ్ముకోవడం మా...?' ఏమంటారో చూడాలి మరి