ఘనంగా సేవాలాల్ మహారాజ్ జెండా పండుగ వేడుకలు ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి- సర్పంచ్ సైదా నాయ

Published: Monday August 08, 2022

బోనకల్, ఆగస్టు 7 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని స్థానిక గిరిజన తండాలో సేవాలాల్ జెండా పండుగను జెండా కమిటీ,సేవాలాల్ మహారాజ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ముందుగా గ్రామ దేవత, బంజారుల ఆరాధ్య తల్లి అయిన శ్రీ మేరమ్మ యాడిని కొలుస్తూ గిరిజన సంప్రదాయ పద్ధతులలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం గిరిజనుల ఆరాధ్య దైవమైన సేవలాల్ మహారాజ్ ను ధూప దీప నైవేద్య కార్యక్రమాలతో పూజా కార్యక్రమాలను తండావాసులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో యువనేత బీపీ నాయక్ మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ జెండా పండుగ గిరిజనుల ఐక్యతకు చిహ్నమని, గిరిజన సాంప్రదాయాల స్ఫూర్తిని కొనసాగిస్తూ భావితరాలకు గిరిజన ఆచారాలను సాంప్రదాయాలను విలువలను అందజేయడమే ఈ పండుగ యొక్క ముఖ్య లక్ష్యమని, ఈ సందర్భంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని రైతులు, వ్యాపారస్తులు కులవృత్తి వ్యాపారస్తులు కార్మికులు, కర్షకులు మిగతా రంగాలవారు వారి వారి రంగాలలో అభ్యున్నతి సాధించాలని మేరమ్మ యాడికి పూజలు నిర్వహించామని అన్నారు.ఈ కార్యక్రమంలో గిరిజన కుల పెద్దలు,గ్రామ సర్పంచ్ భూక్య సైదా నాయక్, మాజీ జెడ్పిటిసి బానోత్ కొండ, ప్రముఖ ఎన్నారై బిజెపి యువనేత బీపీ నాయక్, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోత్ నాగేశ్వరరావు, మండల కాంగ్రెస్ నాయకులు భూక్య బాలకృష్ణ,భానోత్ శ్రీను, ఠాగూర్, చందు, కుమార్ సింగ్, కుల ప్రముఖులు భూక్య కృష్ణ, బాదావత్ సైదులు తదితరులు పాల్గొన్నారు.