దేశం మొత్తం ఒక్కసారి తెలంగాణవైపు

Published: Wednesday August 18, 2021
బాలాపూర్: ఆగస్టు17, ప్రజాపాలన ప్రతినిధి : 75 సంవత్సరాల తర్వాత దళిత బందు తెచ్చిన సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసిన టిఎస్ జి ఓ ఎస్ సెంట్రల్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ పర్వతాలు. ఎందరో వచ్చారు... ఎందరోపోయారు... ఎవ్వరు ఎరుగని దళితుల అభ్యున్నతి కోసం తపన చెందిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి దళిత బందు పథకాన్ని అమలలోకి తీసుకొచ్చిన మహానుభావులు సీఎం కేసీఆర్ కు టి ఎస్ జి ఓ ఎస్ సెంట్రల్ యూనియన్ వైస్ ప్రెసిడెంట్ తుక్కుగూడ మున్సిపాలిటీ మేనేజర్ తెలగ మల్ల పర్వతాలు మంగళవారం బడంగ్ పెట్ లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పర్వతాలు మాట్లాడుతూ.... దళిత సాదికారత, అభివృద్ధిపై సీఎం కేసీఆర్ కు పూర్తి విజన్ ఉందని అన్నారు. 75 ఏళ్ల స్వాతంత్ర చరిత్రలో ఎవ్వరు దళితుల బాగుకోసం ఎలాంటి ఆలోచన చేయలేదని కేవలం ఓటు బ్యాంకు గానే గుర్తించారని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంతో దళితుల జీవితాలలో మార్పు రావడం ఖాయమన్నారు. దళితులు పడుతున్న కష్టాలు, కన్నీళ్ళకు ఇక చరమగీతం పాడే సమయం (రోజులు) ఆసన్నమైందని, ఇది కేవలం కెసిఆర్ వల్లనే సాధ్యమైందిని అన్నారు. ఈ పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తుండడంతో దేశం మొత్తం ఒక్కసారిగా తెలంగాణ వైపు చూస్తున్నదని ప్రజల ఆనందం వ్యక్తం చేశారు.టి ఎస్ జి ఓ ఎస్ సెంట్రల్ యూనియన్ అధ్యక్షులు మామిడిపల్లి రాజేందర్, ప్రధాన కార్యదర్శి రాయకంటి ప్రతాప్, తాను ఈ పథకం గురించి యూనియన్ తరపున సీఎం కేసీఆర్ తో చర్చించామని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి దళితులందరూ రుణపడి ఉండాలని కోరారు.