అందేల.... కార్యకర్తలను కలిసేందుకు బయటికి వెళ్లకుండా నిలువరించిన పోలీసులు

Published: Wednesday November 17, 2021
బాలాపూర్, నవంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గడీల పాలనను బద్దలు కొడతామని మహేశ్వరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జి అందెల అన్నారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ కాన్వాయ్ పై నిన్న గులాబీ గుండాల దాడిని నిరసిస్తూ... సూర్యాపేట జిల్లాకు వెళ్లేందుకు సిద్దమైన మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెల శ్రీరాములు యాదవ్ ను మంగళవారం ఉదయం తన నివాసంలో గృహ నిర్బంధం మీర్ పేట్ పోలీసులు చేశారు. ఎస్ఐ మారయ్య ఆధ్వర్యంలో పోలీసులు అందెల నివాసం వద్ద కాపు కాశారు. కార్యకర్తలను కలిసేందుకు బయటకు వెళ్లకుండా నిలువరించారు. అందెల శ్రీరాములు మాట్లాడుతూ.... టీఆర్ఎస్ సర్కారు, సీఎం కేసీఆర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో గడీల పాలనను బద్దలు కొడతామని హెచ్చరించారు. సిగ్గు లేకుండా టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన ధర్నా, ఆందోళనల్లో ఎంతమందిని అరెస్టు చేశారని ఆయన ప్రశ్నించారు. హూజూరాబాద్ ఎన్నికల ఓటమి తర్వాత పీంకిపార్టీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు. బండి సంజయ్ రైతులకు భరోసా ఇచ్చేందుకు చేపట్టిన యాత్రను అడ్డుకోవడం సరికాదని, టీఆర్ఎస్ పార్టీ పతనానికి నాంది అన్నారు అందెల.