ఆళ్ళపాడు గ్రామంలో ముమ్మరంగా డ్రై డే ఫ్రైడే కార్యక్రమం గ్రామంలో పరిసరాలను తనిఖీ చేసిన ఎంపీడ

Published: Saturday October 08, 2022

బోనకల్ ,అక్టోబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్లపాడు గ్రామంలో శుక్రవారం నిర్వహించిన డ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు, ఎంపీడీవో వేణుమాధవ్ గ్రామంలో ఇళ్లను పరిసరాలను తనిఖీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, డెంగ్యూ, మలేరియా దోమల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వర్షా కాల సీజనల్ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్తలతో ఇళ్లల్లో ఉన్నటువంటి పాత టైర్లు, కొబ్బరి బోండాలు, నీటిసంపు లపై ఉన్న తొట్లను పరిశీలించారు. అనంతరం వారికి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. పరిశ్రాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, లేనియెడల ఆరోగ్య పరిస్థితులు క్షిణీస్తాయని ఎంపీడీవో వేణుమాధవ్ గ్రామ ప్రజలకు తెలియజేశారు. గ్రామంలో తనిఖీలు చేయడం వలన గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉంటారని ఇటువంటి కార్యక్రమం చేయడం మంచిదని సర్పంచ్ మర్రి తిరుపతిరావు కొనియాడారు. అనంతరం గ్రామపంచాయతీ నర్సరని తనికి చేశారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పరశురామ్, అంగన్వాడీ టీచర్ పద్మ, గౌరమ్మ, హుస్సేన్ బీ, ఫీల్డ్ అసిస్టెంట్ షేక్ షేదాబి, ఆశా కార్యకర్తలు కళావతి, రత్నకుమారి, పంచాయతీ సిబ్బంది నాగరాజు పాల్గొన్నారు.