నూతన చట్టాలను రద్దు చేయడమే లెనిన్ కు ఘనమైన నివాళులు: ఎస్ ఎఫ్ ఐ

Published: Friday April 23, 2021
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 22, ప్రజాపాలన ప్రతినిధి : లెనిన్ 151వ జయంతిని పురస్కరించుకొని జూలూరుపాడు మండలం లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ మండల అధ్యక్ష కార్యదర్శులు గార్లపాటి పవన్ కుమార్ బోడ అభిమిత్రలు మాట్లాడుతూ లెనిన్ చేసిన పోరాటాలు మరవలేనిది అన్నారు. అతను ఇరవై నాలుగు గంటలు విప్లవ చర్యా కై పాట పాడిన వ్యక్తి అని అన్నారు. రష్యా సోవియట్ సోషలిస్ట్ రిపబ్లిక్ దేశానికి మొదటి అధినేత అని అన్నారు. దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడలు రైతు చట్టాలు మరియు నూతన విద్యా విధానం ఇలాంటివి రద్దు చేసినప్పుడే లెనిన్ కు మనం  నిజమైన నివాళులర్పించడం జరుగుతుందని అన్నారు. యావత్ భారతదేశం అంతటా లెనిన్ బాటలో నడిచి నిత్యం ప్రజల సమస్య కై పాటుపడాలని అన్నారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్ కోడులు ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర లాంటి రాష్ట్రాల్లో అమల ఆయన అన్నారు. వీటిపై పోరాటం చేయకపోతే హరియానా ఇతర ఇంకా రాష్ట్రాలపై ప్రభావం పడుతుందని అన్నారు. వీటివల్ల నిరుద్యోగం పెరుగుతుందని అన్నారు. శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ప్రైవేట్ యాజమాన్యాల కి ఇష్టారాజ్యంగా అప్పు చెప్పారని అన్నారు. అంతేకాకుండా కార్మికులకు రైతులకు విద్యార్థులకు ఉరితాడుగా మారం అన్న చట్టాలను రద్దు అయ్యే వరకు పోరాటాలు కొనసాగించాలని అన్నారు. ఈరోజు యువత పెడదారి పట్టకుండా లెనిన్ బాల్యం నుండి చేసిన పోరాటాల్లో నడుచుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిడి. పవన్ గగన్ చరణ్ ప్రసాద్ పృథ్వీరాజ్ వికాస్ శివ మనోజ్  తదితరులు పాల్గొన్నారు..