ప్రభుత్వ ఉద్యోగలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

Published: Tuesday October 12, 2021
తెలంగాణ బిసీ జాగృతి రాష్ట నాయకులు నెన్నల‌ నర్సయ్య 
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 11, ప్రజాపాలన : ప్రభుత్వ ఉద్యోగలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ బిసీ జాగృతి రాష్ట నాయకులు నెన్నల‌ నర్సయ్య అన్నారు. పట్టణంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్లో సోమవారం జరిగిన తెలంగాణ బిసీ జాగృతి సమావేశంలో పాల్లొని ఆయన మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో 56 శాతం, దేశ జనాభాలో 60 శాతం బీసీలు ఉన్నప్పటికీ ఉద్యోగాలలో బీసీలకు  రాష్ట్రంలో కేవలం 9 శాతం, కేంద్రంలో 14 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉందని అన్నారు.  1979 లో అప్పటి  కేంద్ర ప్రభుత్వం బిపి మండల్ యాదవ్ పేరుతో కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని, ఆ కమిషన్ నివేదిక 1982 లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. బీసీలకు ఉద్యోగాలలో 27శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని నివేదికల ఇచ్చి 39 సంవత్సరాలు అవుతున్నప్పటికీ 27 శాతం రిజర్వేషన్లను కూడా ప్రభుత్వాలు అమలు చేసిన దాఖలాలు లేవని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ బీసీ యువతతో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చెపడుతామని హెచ్చరించారు. ఈ కార్యాక్రమంలో జిల్లా కార్యదర్శి గుమ్ముల‌ శ్రీనివాస్, పట్టణ కార్యదర్శి తోకల మహేష్, కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, కాగితల సత్యనారాయణ, యువ జాగృతి నాయకుడు మంచర్ల సదానందం, నాయకులు నాగరాజు తదితరులు పాల్గొన్నారు ..