మండల పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకుల ముందస్తు అరెస్ట్ మధిర జూన్ 16 ప్రజా పాలన ప్రతినిధి మున్సిప

Published: Friday June 17, 2022
కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు *శ్రీ రాహుల్ గాంధీ ఈడీ సమన్లు జారీ చేయటం,విచారణ పేరుతో ఈ డి ఆఫీస్ కి పిలిపించడానికి నిరసనగా *ఏ.ఐ.సి.సి* మరియు .టి.పి.సి.సి అధ్యక్షుడు *రేవంత్ రెడ్డి* సీఎల్పీ లీడర్ *మల్లు భట్టి విక్రమార్క పిలుపుతో రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహించటం  జరిగింది.
రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన మధిర పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులను  పోలీసులు ఈ రోజు తెల్లవారుజామున ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారుఈ సందర్బంగా *మిరియాల వెంకట రమణ గుప్తా* మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కావాలని కక్ష కట్టి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీని,రాహుల్ గాంధీని అక్రమ కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెడుతుందని,బీజేపీ కివచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదు అనే భయం పట్టుకొని ఈలాంటి తప్పుడు పనులు చేస్తుందని..దేశం లోని ప్రజలు అందరు ఇది గమనిస్తున్నారని ఇక బీజేపీ ఆటలు సాగవని రాబోయేది ఇందిరమ్మ రాజ్యము అని..అన్నారు దేశం లోని ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రాహూల్ గాంధి కి కాంగ్రెస్ పార్టీ కి అండగా ఉన్నారని అవసరం అయితే కాంగ్రెస్ పార్టీ కోసం ఎటువంటి పొరటానికి అయిన సిద్ధంగా ఉన్నాం అని అన్నారు. పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు *మిరియాల వెంకటరమణ గుప్తా,* మున్సిపల్ కౌన్సిలర్ *కోన ధని కుమార్* ,నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు *తూమాటి నవీన్ రెడ్డి* ,పట్టణ కాంగ్రెస్ నాయకులు *పారుపల్లి విజయ్ కుమార్* ,పట్టణ intuc అధ్యక్షుడు *షేక్ బాజి* ,మైనార్టీ సెల్ అధ్యక్షుడు *షేక్ జహంగీర్* కాంగ్రెస్ నాయకులు *మాగం ప్రసాద్,రామకృష్ణ,మొహమ్మద్ రహీం,అది మూలం శ్రీనివాసరావు,చిలుకూరి కృష్ణ, కరీం* వీరిని ముందస్తుగా నిర్బంధం చేశారు. మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలోరాష్ట్ర పిసిసి మరియు సి ఎల్ పి ఆదేశానుసారం రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా ముందస్తు అరెస్టు చేసిన మధిర రూరల్ పోలీసులు. అరెస్టయినవారిలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూరం శెట్టి కిషోర్, మండల బిసి సెల్ అధ్యక్షులు చిలువేరు బుచ్చి రామయ్య, మండల కిసాన్ సెల్ అధ్యక్షులు వెంకటేశ్వర్ రెడ్డి  ఉన్నారు.