రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన బూర్గంపాడ

Published: Wednesday December 07, 2022
 డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులు అర్పించడం జరిగినది.ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం అంబేద్కర్ సెంటర్ నందు భారతరత్న  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన..    సాయిబాబా బిట్రా మరియు బొప్పన ప్రభాకర్, సాలయ్య జక్కం సుబ్రహ్మణ్యం, సత్యం,  మాజీ జెడ్పిటిసి భూ పెళ్లి  నరసింహారావు,.
భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ, మహనీయుడికిదే మా ఘన నివాళులు  అని తెలిపి, వారి ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు., భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది అన్నారు. ఆడవారి కోసం ప్రసూతి సెలవులు కల్పించి వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించిన మహానుభావుడని, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి సాధ్యమని పార్లమెంట్లో ఆర్టికల్స్ ప్రవేశపెట్టిన ధీరథుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని అంతేకాకుండా ఓటు హక్కు ప్రవేశపెట్టి మీ ఓటు హక్కు ద్వారానే  మీకు నచ్చిన  నాయకుల్ని  ఎన్నుకునే అవకాశం కల్పించిన మహానుభావుడు    రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్. అని ఈ సందర్భంగా తెలియజేశారు