మల్లాపూర్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సిద్ధ బాలరాజుకి సన్మానం

Published: Wednesday June 16, 2021
మల్లాపూర్, జూన్ 15 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా, సామాజికవేత్తగా గుర్తింపు పొందిన మల్లాపూర్ మండలంలోని వాల్గొండ గ్రామానికి చెందిన సిద్ధ బాలరాజుకు మంగళవారం మల్లాపూర్ లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో సన్మానం చేయడం జరిగింది. సిద్ధ బాలరాజు గతంలో పురాతన దేవాలయం అయినటువంటి వాల్గొండ రామలింగేశ్వర దేవాలయం పై అద్భుతమైనటువంటి పాటలను రాయడం జరిగింది. అంతేకాదు తెలంగాణ ఉద్యమంలో అమరుడైన దండిగా పృథ్వీరాజ్ పై అద్భుతమైన పాటలు రాసి పాడడం జరిగింది. ఇటీవల జానపద గేయాలతో పాటుగా కరోనాపై సమాజానికి ఒక మంచి మెసేజ్ ని ఈ పాట రూపంలో అందించారు. ఇలాంటి గొప్ప కళాకారుడు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని మండలానికి మంచి గుర్తింపు తీసుకురావాలని లైన్స్ క్లబ్ నాయకులు రుద్ర రాంప్రసాద్ అభినందిస్తూ సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు కె రమేష్, వాల్గొండ సర్పంచ్ దండక గంగు రాజన్న, మల్లాపూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ పెద్దిరెడ్డి లక్ష్మణ్, అంబేద్కర్ సంఘం నాయకులు దళిత రాజు, ఉయ్యాల లక్ష్మణ్, బొల్లారం శేఖర్, ఎర్ర మోహన్ రాజ్, నల్ల లక్ పతి, అరే గడ్డి సురేష్  తదితరులు పాల్గొన్నారు.