ఇబ్రహీంపట్నం జూన్ తేది 17 ప్రజాపాలన ప్రతినిధి. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించా

Published: Saturday June 18, 2022

భారత విద్యార్థి ఫెడరేషన్ ( SFI ) ఇబ్రహీంపట్నం మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ZPHS బాలికల ఉన్నత పాఠశాలను వారు సందర్శించారు. ఈ సందర్భంగా *SFI  రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు మస్కు చరణ్* మాట్లాడుతూ ... ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు ఐదు వందల మంది విద్యార్థులు ఉన్నత పాఠశాలలో కనీసం మూత్ర శాలలు కూడా సరిపడా లేదని అన్నారు తాగడానికి నీరు లేక బోరు నీళ్లు తాగే పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో నెలకొందని అన్నారు.  *విద్యా శాఖ మంత్రి సొంత జిల్లాలోనే ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఈలా ఉందంటే ఇక రాష్ట్రం మొత్తం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అన్నారు.
ఇప్పటికైనా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకపోతే భారత విద్యార్థి ఫెడరేషన్ (SFI) ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో SFI ఇబ్రహీంపట్నం మండల అధ్యక్ష కార్యదర్శులు తరాంగ్ , శ్రీకాంత్  ఉపాధ్యక్షుడు వినోద్ సహాయ కార్యదర్శి వంశీ ,  పవన్ నాయకులు చిరు  సిద్దు, వర్షిత్, సాయి, కిట్టు,వంశీ, శ్రవణ్, శివ, మహేందర్ తదితరులు పాల్గొన్నారు