తెలంగాణ అమరవీరులకు కు మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ తరపున వారి త్యాగాలకు ఘన నివాళి

Published: Wednesday February 16, 2022
మధిర ఫిబ్రవరి 15 ప్రజాపాలన ప్రతినిధి మధిర మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం నాడు మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అద్దంకి రవికుమార్ అధ్యక్షతన నిర్వహించిన పత్రికా సమావేశంలో మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ నాయకులు తూమాటి నవీన్ రెడ్డి మాట్లాడుతూ అమరవీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రోజుకు ఒక నిరుద్యోగి ఆత్మహత్య చేసుకుంటున్నా ఇప్పటివరకు ఉద్యోగాల కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం లేదుకెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిరుద్యోగుల శాతం పెరిగి పోయింది ఇందుకు గాను తెలంగాణ యువజన కాంగ్రెస్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కెసిఆర్ గారి జన్మదినాన్ని నిరుద్యోగ దినోత్సవంగా ప్రకటిస్తూ 15, 16, 17, తేదీల్లో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిరసన కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగింది 15వ తేదీన అమర వీరులకు నివాళి అర్పిస్తూ పత్రికా ప్రకటన 16వ తేదీ నిరుద్యోగ దీక్ష 17వ తేదీన అన్ ఎంప్లాయిమెంట్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియాలో కెసిఆర్ తెలంగాణాలో నిరుద్యోగులను ఎలా మోసం చేస్తున్నాడు వివరిస్తూ ప్రచారం చేయాలి ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది ఏమనగా కెసిఆర్ గారు ఎన్నికల వాగ్దానాలు లో భాగంగా నిరుద్యోగ భృతి 3016 రూపాయలు ప్రకటించారుఒక్కొక్క నిరుద్యోగికి 3016 + 38  నెలలు ఒక లక్ష 14వేల ఆరు వందల ఎనిమిది రూపాయలు బాకీ ఉంది వాటిని వెంటనే చెల్లించాలి ఖాళీగా ఉన్న రెండు లక్షల 50 వేల ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలిఇక కేసీఆర్ తెలంగాణ సమాజాన్ని మాటలతో మాయ చేస్తూ పబ్బం గడుపుతున్నారు అమరుల త్యాగాల పై ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలోదళిత భందు పేరుతో దగా దళిత సీఎం పేరుతోదగా దళితులకు 3 ఎకరాల పేరుతో దగా నిరుద్యోగ భృతి పేరుతో దగా నోటిఫికేషన్ల పేరుతో దగాఇలా తెలంగాణ రాష్ట్రంలో మీడియా ప్రతినిధుల ఎదుట మోసం చేశాడు సకలజనుల ను మోసం చేసిన కేసీఆర్ పుట్టిన రోజును యువజన కాంగ్రెస్ నిరుద్యోగ దినోత్సవంగా పేర్కొంటూ పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలతో ప్రణాళిక రూపొందించటం జరిగింది ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపు ఇస్తున్నాము ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సూరoశెట్టి కిషోర్ ఐ ఎన్ టి యు సి మండల అధ్యక్షులు కోరం పల్లి చంటి సేవాదళ్ అధ్యక్షుడు ఆదూరు శ్రీనివాస్ పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ జహంగీర్ పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షులు షేక్ బాజీ షేక్ కుదాపీర్ చక్రి యూత్ కాంగ్రెస్ నాయకులు మాగంటి చంటి గొల్లమందల ఉదయ్, సిద్దు, బాణావత్ సాయి కృష్ణ, కె ప్రకాష్, దోమల సురేష్, మధు, సాయి రాకేష్ తదితరులు పాల్గొన్నారు