రైల్వే లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయాలి

Published: Friday June 04, 2021

డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్
ఖిరిడి గ్రామంలో ప్లకార్డులతో నిరసన

ఆసిఫాబాద్ జిల్లా జూన్ 03 (ప్రజాపాలన, ప్రతినిధి) : దేశంలో బీజేపీ మోడీ ప్రభుత్వం 7 ఏండ్ల పాలనలో ఇప్పటివరకు నిరుద్యోగ యువతకు ఎలాంటి ఉద్యోగాలు కల్పించడం లేదని, వివిధ శాఖలో పోస్టులు ఖాళీ ఉన్నా ప్రభుత్వం వాటిని భర్తీ చేయడంలో పూర్తిగా విఫలమైందని, గురువారం డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆలిండియా పిలుపుమేరకు వాంకిడి మండలంలోని ఖిరిడి గ్రామము లో డివైఎఫ్ఐ నాయకులు ప్లకార్డులతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్ మాట్లాడుతూ దేశంలో బిజెపి ప్రభుత్వం 2 సార్లు అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడం లేదని, నోటిఫికేషన్ ఇవ్వకుండా నిరుద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నారు. ఇండియన్ రైల్వే లో ఉన్న ఖాళీ పోస్టులను భర్తీ చేయడంలో బిజెపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. దేశంలో అనేక ప్రభుత్వరంగ సంస్థలలో వేల కోట్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, రైల్వే, పోస్టల్, విమానాశ్రయం, కోల్ మైన్, బ్యాంకింగ్, సేవా రంగాలలో ఇలా అనేక శాఖలో పోస్టులు ఖాళీ ఉన్నా, వాటిని ప్రభుత్వం భర్తీ చేయడం లో విఫలమైందన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం వెంటనే భర్తీ చేయాలని, యువతకు ఉద్యోగాలు కల్పించాలని, దేశంలో అతిపెద్ద ఉపాధి కల్పిస్తున్న రైల్వేలో రిక్రూట్మెంట్ చేయాలన్నారు. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయకపోవడంతో నిరుద్యోగ యువత నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖాళీ లు ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, లేనిపక్షంలో డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు వడ్లూరి మల్లేష్, దుర్గం వాసుదేవ్, నిఖిల్ లు పాల్గొన్నారు.