సంక్షేమ, అభివృధ్దిని ప్రవేశపెట్టింది టిడిపి

Published: Tuesday March 30, 2021

అధ్యక్షులు మనీ రామ్ సింగ్ జీవరత్నం, సెక్రటరీ బద్దెన రాజనర్సు.
పట్టణంలో ఘనంగా తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.


బెల్లంపల్లి, మార్చి29, ప్రజాపాలన ప్రతినిధి : సంక్షేమ, అభివృధ్ది పథకాలు  ప్రవేశపెట్టి తెలుగు జాతి గౌరవాన్ని చాటిచెప్పింది తెలుగు దేశం పార్టి అని ఆ పార్టీ అధ్యక్షులు మనీ రామ్ సింగ్ జీవరత్నం , సెక్రటరీ బద్దెన రాజనర్సు లు పేర్కొన్నారు. సోమవారం తెలుగుదేశం పార్టీ  నలభై ఏళ్ళ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని బెల్లంపల్లి పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా ఆవిష్కరించి ఘనంగా జరుపుకొన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు స్వర్గీయ ఎన్టీ రామారావు  బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం జనతా వస్త్రాలు, రెండు రూపాయలకు కిలో బియ్యం, పటేల్ పట్వారి వ్యవస్థ రద్దు, మండల్ ఆఫీస్ లో పునరుద్ధరణ లాంటి కార్యక్రమాలతో ప్రజలను చైతన్య పరుస్తూ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేశారని అన్నారు. గిరిజనులకు, నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వడం జరిగిందని, అలాగే 1985 లో సింగరేణిలో 30 వేల మంది నిరుద్యోగులకు పరుగుపందెం ద్వారా ఉధ్యోగాలు కల్పించారని పేర్కొన్నారు. బిఐఐఎఫ్ ఆర్ లోకి వెళ్ళినప్పుడు సింగరేణి రక్షించడానికి అప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం దగ్గర అ 1163 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకువచ్చి సిక్ ఇండస్ట్రీ కాపాడిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి కే దక్కుతుందని పేర్కొన్నారు. స్త్రీలకు 33శాతం రిజర్వేషన్ కూడా కావాలని అని పోరాడింది టిడిపినే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో లో తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు సిరికొండ కనకయ్య, టి ఎన్ టి యు సి ఉపాధ్యక్షులు బెల్లంపల్లి సిహెచ్ రమేష్ , కార్యదర్శి గుళ్ళు మల్లయ్య, మేకల రాజయ్య, సిహెచ్ ప్రకాష్, భగవాన్ రాజ్ కుమార్ పాండే, రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.