వ్యాపారాలకు ఇబ్బందికల్గించే నిర్మాణాన్ని వెంటెనే ఆపండి మున్సిపల్ కమిషనర్ కు విజ్ఞప్తి చేస

Published: Tuesday July 05, 2022
బెల్లంపల్లి జూలై 4 ప్రజా పాలన ప్రతినిధి: మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని కాంట చౌరస్తాలో గల చికెన్ సెంటర్, ఫ్రూట్, కిరాణా
 వ్యాపారస్తుల వ్యాపారాలకు మధ్యలో ఇబ్బంది కలిగించే నిర్మాణాన్ని   వెంటనే ఆపేయాలని వ్యాపారస్తులు మున్సిపల్ కమిషనర్ కు సోమవారం విజ్ఞప్తి చేశారు.
 ఈ సందర్భంగా వ్యాపారస్తులు మాట్లాడుతూ  గత 30 సంవత్సరాల నుండి ఇదే స్థలంలోమా వ్యాపారాలు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నామని,నూతన మార్కెట్ నిర్మాణ విషయంలో తాము హై కోర్ట్ నుండి  స్టే తెచ్చుకొని వ్యాపారాలు కొనసాగిస్తున్నామని,అయితే 14 చికెన్ సెంటర్ల మధ్యలో హై కోర్ట్ పిటిషనర్ అయినట్టు వంటి మరో వ్యక్తి అక్రమ నిర్మాణం చేపడుతున్నాడని, ఆనిర్మాణం వల్ల 14 షాప్ ల  యాజమానులమైన మాకు చేపడుతున్న నిర్మాణం వల్ల వ్యాపారాలకు  ఇబ్బంది ఏర్పడే పరిస్థితి ఉందని. అట్టి నిర్మాణ చేపడుతున్న వ్యక్తికి వేరే చోట స్థలం కేటాయిస్తే మాకు ఎటువంటి అభంత్రం లేదని వారన్నారు .
కొత్తగా వచ్చిన మున్సిపల్ కమిషనర్ గంగాధర్ అవగాహన లోపం వల్లే ఈ సమస్య ఏర్పడిందని, కావున తక్షణమే  మున్సిపల్ ఛైర్మన్ శ్వేత,మున్సిపల్ కమిషనర్ గంగాధర్, చొరవ తీసుకొని నిర్మాణాన్ని ఆపివేయాలని వారు డిమాండ్ చేశారు. 
ఈ కార్యక్రమంలో ఎండి గౌస్, బాలాజీ, చికెన్ సెంటర్,ఫ్రూట్ ,మరియు కిరాణా, దుకాణాల, వ్యాపారస్తులు, యాజమానులు, తదితరులు పాల్గొన్నారు.