నాణ్యత ప్రమాణాలు వాడాలని స్థానిక కార్పొరేటర్

Published: Monday July 26, 2021
బాలాపూర్: (ప్రతినిధి) ప్రజాపాలన : పోచమ్మ టెంపుల్ దగ్గర సిసి రోడ్లు వేస్తున్న కాంట్రాక్టర్ల వద్ద నాణ్యత ప్రమాణాల్లో తప్పక వాడాలని స్థానిక కార్పొరేటర్ అన్నారు. మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 27వ డివిజన్ లో సిర్లా హిల్స్ కాలనీలో పోచమ్మ టెంపుల్ దగ్గర సిసి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్న సందర్భాల్లో స్థానిక కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి హాజరై, కాంట్రాక్టర్లతో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కోరారు. పద్మశ్రీ మన్నెమ్మ, రాజు, నారాయణ, కాలని మహిళలు పాల్గొన్నారు. అదేవిధంగా గురుపూజోత్సవం సందర్భంగా ప్రశాంత్ హిల్స్ ఫేస్ 3 కాలని లో శ్రీ రామకృష్ణ పరమహంస ప్రభత్ శాఖ కార్యనిర్వాహక వి.యాదిరెడ్డి, ముఖ్య శిక్షణ సత్యనారాయణ, నగర ప్రౌడ ప్రముఖుల కొప్పుల ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో పూజోత్సవం నిర్వహించారు. ముఖ్య వక్తగా హరి గోపాల కృష్ణ స్థానిక కార్పొరేటర్ పసునూరి బిక్షపతి చారి, కీసర అరుణాచల్ రెడ్డి, మమత ప్రవీణ్ స్వయం సేవకులు అందరూ పాల్గొన్నారు.