విద్యార్థుల భవిష్యత్తు బంగారం అయ్యే అవకాశం

Published: Thursday July 28, 2022
యాదాద్రి భువనగిరి జిల్లా 27 జులై ప్రజాపాలన:ఎన్.సి.సి.విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అని అధికారి దూడలు వెంకటేష్ అన్నారు.
 
విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఎన్.సి.సి. ద్వారా కలుగుతుందని ఆర్మీ అధికారులు బి.శ్రీనివాస్, భరత్ కారత్ లు అన్నారు. ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2022 సంవత్సరానికి గాను ఎన్.సి.సి. ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎన్.సి.సి. ద్వారా విద్యార్థుల భవిష్యత్తు బంగారం అవుతుందని, స్వీయ క్రమశిక్షణ, దేశభక్తి అలవడుతుందని, నాయకత్వ లక్షణాలు, మూర్తి మత్వ భావనలు పెంపొందుతాయని అన్నారు. అంతేకాకుండా ఎన్.సి.సి. ద్వారా భవిష్యత్తులో దేశ రక్షణకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
 
ఈ ఎన్.సి.సి. శిక్షణ ద్వారా శారీరక, మానసిక దృఢత్వం కలుగుతుందని తద్వారా భవిష్యత్తులో మంచి పౌరులుగా తయారయ్యే అవకాశం ఉందని అన్నారు. అంతేకాకుండా ఈ ఎన్.సి.సి. సర్టిఫికెట్ ద్వారా ఉన్నత స్థాయిలో చదువులు, ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని తెలిపారు.
 ఈ కార్యక్రమంలో 50 మంది విద్యార్థులను ఎన్.సి.సి. కాడేట్స్ గా సెలెక్ట్ చేయడం జరిగిందన్నారు.
 ఈ కార్యక్రమంలో ఎన్.సి.సి. అధికారి దూడల వెంకటేష్, ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయురాలు శ్యామసుందరి, శేఖర్, హరినాథ్ రెడ్డి, యోగేశ్వరరావు, సాంబశివ, ఖాజా అలీ, మురళి, నవీన్ కుమార్, రవి, వేణు, స్వర్ణలత, లక్ష్మమ్మ కవిత, విజయలక్ష్మి, మేరీ స్వరూప రాణి, మీరా తదితరులు పాల్గొన్నారు.