ఆవులను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. గో సంరక్షణ సమితి సభ్యులు కోడి రమేష్, రాచర్ల సంత

Published: Thursday September 08, 2022
బెల్లంపల్లి సెప్టెంబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: నోరులేని మూగజీవాలను కబెలాలకు తరలిస్తూ కోట్లు సంపాదిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణ బిజెపి నాయకులు గో సంరక్షణ  సమితి సభ్యులు కోడి రమేష్, రాచర్ల సంతోష్ లు డిమాండ్ చేశారు.
బుధవారం స్థానిక కూరగాయల మార్కెట్ ప్రాంతంలో బొలెరో వ్యాన్  TS 21 T 2272 లో తరలిస్తున్న ఏడు ఆవులను, లేగ దూడలను  హృదయ విదారకంగా నిర్దాక్షిణ్యంగా, కట్టిపడేసి తరలిస్తుండగా పట్టుకొని స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించామని వారు తెలిపారు.
డ్రైవర్ సాదిక్ తెలిపిన వివరాల ప్రకారం బెజ్జూరు మండలం కుక్కుట గ్రామంలో జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని దొలవకుంట గ్రామానికి తీసుకు వెళ్తున్నామని తెలిపారు.
తరలిస్తున్న  ఆవులను  విడిపించి స్థానిక మాల గురజాల  గోశాలకు తరలించామని, వ్యానును, వ్యాను డ్రైవర్ను స్థానిక వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించామని వారు తెలిపారు. 
ఇకముందు గోవులను తరలించే ముఠాను పట్టుకొని గోవులను తరలించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు.