పాలకుర్తి వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇంటివద్దే టీకాలు

Published: Monday January 10, 2022
హైదరాబాద్ 9 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: ప్రభుత్వ ఆదేశాల మేరకు ఉన్నత శ్రేణి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం  పాలకుర్తి లో కొవిడ్ నియంత్రణ దిశగా ప్రత్యేక కార్యచరణ రూపొందించి అమలు చేయడం జరుగుతుందని వైద్య అధికారి డాక్టర్ ప్రియాంక తాల్క తెలిపారు. పాలకుర్తి ఉన్నత శ్రేణి వైద్య ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇప్పటి వరకు కొవిడ్ వ్యాక్సినేషన్ మొదటి డోసు 100 శాతం, రెండవ డోసు 80 శాతం మరియు 15-18 సంవత్సరాల మధ్య పిల్లలకు 50 శాతం పూర్తి అయిందని, మిగతాది పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని వైద్య అధికారి తెలిపారు. జిల్లాలోని ఆశ, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు, పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాలు, ప్రజా ప్రతినిధులు, సంబంధిత శాఖ అధికారుల సమన్వయంతో టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. కొవిడ్ కేసులను గుర్తించేందుకు పాలకుర్తి మరియు ఇతర ప్రాంతాల్లో బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ బృందంలో ఆశ, ఆరోగ్యకార్యర్త, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఉంటారని, కేసులను గుర్తించి రాపిడ్ ఆంటిజన్ టెస్ట్ (ఆర్.ఎ.టి.) కిట్ల ద్వారా పరీక్షలు, స్క్రీనింగ్ నిర్వహించి పాజిటివ్ వచ్చిన వారిని ఇంటిలో విడిగా ఉంచడం (హెూమ్ ఐసోలేషన్) అవగాహన కల్పించడం జరుగుతుందని వైద్య అధికారి తెలిపారు. రియల్ రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేజ్ పాలిమరేజ్  చైన్ రియాక్షన్ (ఆర్.టి.పి. సి.ఆర్.) పరీక్షలు ప్రతిరోజు ఆరోగ్య కేంద్రంలో చేయడం జరుగుతుందని వైద్య అధికారి తెలిపారు. ఆరోగ్య కార్యకర్త, ఫార్మా సిస్టర్ల తో ఏర్పాటు చేసిన ఆర్.బి.ఎస్.కె. బృందం కరోనా పరీక్షలపై పని చేస్తుందని తెలిపారు. మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులను ఎప్పటికప్పుడు శుభ్ర పరచు కోవడం లాంటి కొవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రజలందరు సహకరించాలని ఈ సందర్భంగా వైద్య అధికారి డాక్టర్ ప్రియాంక తాల్క కోరారు.