తక్కెళ్ళపాడు గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు

Published: Monday September 27, 2021
ఎర్రుపాలెం, సెప్టెంబర్ 26, ప్రజాపాలన ప్రతినిధి : మండలం లోని తక్కెళ్ళపాడు గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ కూరపాటి సుందరమ్మ ఆధ్వర్యంలో వీర వనిత చాకలి ఐలమ్మ గారి 126వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఐలురీ నాగిరెడ్డి, ఎంపీటీసీ కూరపాటి యశోద, సెక్రెటరీ k.శ్రీనివాస్, MRPS జిల్లా నాయకులు కూరపాటి ప్రభాకర్, రజక సంఘం జిల్లా అధ్యక్షులు తలుపుల విజయ్ బాబు, పెద్దలు శీలం మాధవ రెడ్డి, కూరపాటి వెంకటరత్నం,ఆశ, అంగన్వాడి, ఐకేపీ, పంచాయతీ సిబ్బంది పాల్గొనడం జరిగింది