లక్ష్యాలు చేరువలో సమిష్టి కృషి అవసరం : సర్పంచ్ యం గల దయామణి

Published: Monday April 25, 2022
బోనకల్, ఏప్రిల్ 24 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని కలకోట గ్రామ పంచాయతీలో జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఆదివారం జరిగిన ప్రత్యేక సమావేశంలో సర్పంచ్ యంగల దయామని పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ లక్ష్యాల చేరువలో ప్రతిఒక్కరి కృషి అవసరమని అన్నారు. సీనియర్ పంచాయతీ కార్యదర్శి ఆదాము మాట్లాడుతూ రాబోయే రెండు సంవత్సరాలు గాను ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను చేరుకునేందుకు మౌళిక సదుపాయాలను కల్పిస్తూ గ్రామంలోని అన్ని వనరులును వినియోగించుటకు, జాతీయ పంచాయతీరాజ్ పోర్టల్ లో సూచించిన తొమ్మిది అంశాలను పరిశీలన చేసి కొన్నింటిని దత్తత తీసుకొని అట్టి దత్తత అంశాలను రాబోయే రెండు సంవత్సరాల్లో అమలుపరచు ఈ విధంగా జాతీయ పంచాయితీ రాజ్ వైబ్రాంట్ గ్రామసభ పోర్టల్ లో అప్లోడ్ చేయడం గురించి చర్చించి తీర్మానించామని అన్నారు.అనంతరం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉపన్యాసాన్ని వైబ్రాంట్ పోర్టల్ నుంచి తిలకించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చావా హరిత, ఎంపీటీసీ యంగల మార్తమ్మ, సెక్రటరీ ఆదాము, పాలకవర్గ సభ్యులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.