గోవిందపురం ఏ గ్రామంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం

Published: Thursday January 20, 2022
బోనకల్, జనవరి 19 ప్రజాపాలన ప్రతినిధి : మండల పరిధిలోని గోవిందాపురం ఏ గ్రామంలో గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద కరోనా టేస్ట్ మరియు కరోనా వాక్సిన్ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావు  మాట్లాడుతూ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా బయటి నుంచి బంధువులు వచ్చిన సందర్భంలో సర్పంచ్ బాగం శ్రీను వా‌సరావు ఏఎన్ఎం తిరుపతమ్మ గ్రామంలో కరోనా టేస్ట్ మరియు వ్యాక్సినేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో జ్వరం దగ్గు వచ్చినా మన గ్రామ పంచాయితీ ఆఫీసు వద్ద కరోనా టేస్ట్ చేయించుకోవాలని గ్రామ ప్రజల కు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కుర్ ఇస్రం దేవమణీ, అంగన్వాడీ టీచర్లు బాగం లక్ష్మి, ఇస్రం నాగేంద్రమ్మ, గ్రామ పంచాయతీ వర్కర్ దార సురేష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి హిమబిందు తదితరులు పాల్గొన్నారు.