అగ్నిపద్ పథకానికి వ్యతిరేకంగా సత్యగ్రహ దీక్ష

Published: Tuesday June 28, 2022

మధిర జూన్ 27 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోకేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన అగ్నిపద్ పథకానికి వ్యతిరేకంగా ఏఐసీసీ మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మల్లుభట్టి విక్రమార్క ఆదేశాల  మేరకు మధిర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆర్వి కాంప్లెక్స్ ఎదురుగా నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.రక్షణ రంగంలో కాంట్రాక్ట్ పద్ధతులు ఉద్యోగాలు ఇవ్వటం  దేశ రక్షణకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉన్నందున అగ్నిపథ్ పధకాన్ని వెంటనే రద్దు చేయాలని దేశ వ్యాప్త ఆందోళనలో భాగంగా ఈ రోజు మధిర పట్టణం లో  కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టామని అన్నారు..వెంటనే అగ్నిపథ్ పధకాన్ని రద్దు చేయాలని మరియు పాత పద్ధతిన ఆర్మీ ఉద్యోగాల నియామకం చేపట్టాలి అన్నారు..

ఈ కార్యక్రమంలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురంశెట్టి కిషోర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, ముదిగొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమ్మినేని రమేష్ బాబు,చింతకని మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వర్లు, బి బ్లాక్ అధ్యక్షుడు కన్నె బోయిన గోపి యాదవ్, ఎర్రుపాలెం  మండల ఉపాధ్యక్షుడు బండారు నర్సింహారావు, మధిర మున్సిపాలిటీ కౌన్సిలర్లు కోన ధని కుమార్, మునుగోటి వెంకటేశ్వరరావు, సర్పంచులు పులిబండ్ల చిట్టిబాబు, మదర్ సాహెబ్, మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు,బొమ్మకంటి హరిబాబు  నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి కాంగ్రెస్ పట్టణ నాయకులు పారుపల్లి విజయకుమార్,మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అద్దంకి రవికుమార్, మండల ఐఎన్టియుసి అధ్యక్షుడు కోరం పల్లి చంటి, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు దుంప వెంకటేశ్వర్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ ఫయాజ్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షుడు షేక్ జహంగీర్, పట్టణ ఐఎన్టియుసి అధ్యక్షుడు షేక్ బాజీ, బీసీ సెల్ అధ్యక్షుడు బిట్ర ఉద్దండయ్యా, పట్టణ ఐఎన్టియుసి మహిళా అధ్యక్షురాలు మైలవరపు లక్ష్మీ స్వాతి, పట్టణ డివిజన్ కమిటీ అధ్యక్షులు బానోతు రమణ నాయక్,మాగం ప్రసాద్, రామారావు, ఆదిమూలం శ్రీనివాసరావు, తలపుల వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ నాయకులు డేవిడ్,నిడమనూరి వంశీ, పత్తే పరఫు సంగయ్య, సత్యనారాయణ రెడ్డి, ఆవుల కిరణ్, కరీముల్లా, కొంగాల ప్రసాద్,రబ్బానీ,ఇబ్రహీం,సజ్జ ప్రసాద్ పుట్ట పుల్లారావు మొదలగువారు పాల్గొన్నారు....