సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కరోనా బాధితులతో చికెన్ తో భోజనం ప్యాకెట్లు పంపిణీ

Published: Thursday June 10, 2021
మూడో రోజు కొనసాగిన అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరరావు సేవా కార్యక్రమం.
మధిర, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : మధిర ప్రభుత్వ ఆసుపత్రి నందు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అమరజీవి కామ్రేడ్ మందడపు నాగేశ్వరావు, జ్ఞాపకార్థ నిమిత్తం మూడవరోజు కరోనా  బాధితులకు, మధిర ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ సెంటర్లో ఉన్న కరోనా బాధితులుకు హాస్పిటల్ స్టాప్ కు చికెన్ తో భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ముందుగా సిపిఐ పట్టణ కార్యదర్శి బెజవాడ రవిబాబు, మండల కార్యదర్శి వుట్ల కొండలరావు, సహాయ కార్యదర్శి చావా మురళీకృష్ణ, చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డాక్టర్ అనిల్ కుమార్ సమక్షంలో ఆయనతో కలిసి కరోనా బాధితులకు,స్టాప్ కు భోజనం ప్యాకెట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు హాస్పిటల్ ఇంచార్జ్ డాక్టర్ అనిల్ కుమార్ ని కరోనా బాధితులకు అందుతున్నచికిత్స, వసతులు, రోగుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎవరు అధైర్య పడవద్దని ధైర్యంగా ఉండి కరోనాన్ని జయించాలని వారు కరోనా బాధితులకు సూచించారు, సిపిఐ పార్టీ బాధితులకు అండగా ఉంటుందని వారి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తలారి రమేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్, రంగు నాగకృష్ణ, శిరివెరు శీను, అప్పారావు, మంగళగిరి రామాంజనేయులు, చెరుకూరి వెంకటేశ్వర్లు, అన్నవరం సత్యనారాయణ, యలమద్ది  వెంకట్రామయ్య, తదితరులు పాల్గొన్నారు.