మన పుట్టిన రోజు అభాగ్యుల జీవితాల్లో వెలుగులు నింపుదాం-బ్యాంకు ఉద్యోగి ఖమ్మంపాటి శివకుమార్

Published: Tuesday August 24, 2021
మధిర, ఆగష్టు 23, ప్రజాపాలన ప్రతినిధి : ఈ రోజు సాయంత్రం 5 గంటలకు మధిర పట్నంలో ప్రముఖ సామజిక సేవకుడు మధిర ఆశ మిత్ర లంకా కొండయ్య నివాసంలో మధిర బంజారా కాలనీ నివాసులు ప్రముఖ బ్యాంక్ ఉద్యోగి శ్రీ ఖమ్మంపాటి శివకుమార్, చంద్రకళ దంపతుల కుమారుడు సిద్దార్ధ (మెయిన్ రోడ్ లో సీనియర్ టైలర్ శ్రీ ఖమ్మం పాటి పుల్లారావు దుర్గ దంపతుల మనుమడు) పుట్టినరోజు సందర్బంగా లంకా కొండయ్య గారి సలహా మేరకు మధిర మండలం మరియు ఎర్రుపాలెం మండలంలో ఉన్న కడు పేద కుటుంబాలకు ఆశ బాధిత కుటుంబాలకు ఒకొక్కరికి ఒక నెలకు సరిపడ కిరాణా సరుకులు శివకుమార్ చంద్రకళ చేతులుమీదగా లంకా కొండయ్య అందచేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మనపిల్లల పుట్టినరోజులు గాని మన పుట్టినరోజులు గాని వ్యర్థమైన ఖర్చులు పెట్టె బదులు ఇలాంటి నిరుపేద అనారోగ్య బాధిత కుటుంబాలకు ఎంతో కొంత సహాయం పడడం మానవధర్మం అని వారు తెలియచేసారు. ఈ కార్యక్రమంలోలంకా ఫౌండేషన్ వాలింటర్లు శ్యామ్, అంజి, గోపి, సాయి, కరుణ, వెంకటేష్ పాల్గొన్నారు.