పెరిగిన పెట్రోల్,నిత్యావసర ధరలు తగ్గించాలి; వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిరసన

Published: Saturday May 28, 2022
అశ్వారావుపేట (ప్రజాపాలన ప్రతినిధి)అశ్వారావుపేట నేనుమండల కేంద్రంలో వామపక్ష పార్టీల  ఆధ్వర్యంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ మరియు నిత్యవసర సరుకుల ధరలను వెంటనే తగ్గించాలని తాసిల్దార్  కార్యలయం ముందు ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి ఎండి  సలీం,సిపిఐ ఎమ్ఎల్  ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినేపల్లి ప్రభాకర్, సిపిఐ ఎమ్ ఎల్ ప్రజా పందా జిల్లా నాయకులు కంగాల కల్లయ్య   మాట్లాడుతు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పోటిపడి ప్రజల పై భారాలను మోపుతున్నాయని, కరోనా దెబ్బకు ఆర్ధికంగా చితికిపోయి ఇంకా కోలుకోని ప్రజలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెంచుతున్న  ధరల భారాలు మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా తయారైందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వసలు ప్రజా వ్యతిరేక విదానాలను విడనాడి పెట్రోల్, డీజిల్ పై కేంద్రం విదిచించిన అన్నిరకాల సెస్సులను  రద్దుచేయాలని,ఎక్కైజ్ సుంకంతగ్గించాలని, పెంచిన వంట గ్యాస్ ధర తగ్గించాలని, నిత్యవసరాలు బట్టలు,చెప్పులపై జీఎస్డీని తగ్గించాలని,స్డీల్,సిమెంట్,ఇసుక ధరలు అదుపు చేయాలని,దేశంలో ప్రజా పంపిణీ వ్యవస్థను పటిష్టం చేసి,14 రకాల నిత్యవసరాలు అందించాలని, దారిద్రరేఖకు దిగువన ఉన్న పేద ప్రజలకు నెలకు రు.7500 లు ఇవ్వాలని, ఉపాధి హామి పథకాలకి నిధులు పెంచాలని,పట్టణ ప్రాంతాల్లో కూడా అమలు చేయాలని,ఉద్యోగ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని,నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వాలని,అసంఘటిత కార్మికులకు కనీసవేతనం రు.26000 లు చేయాలని,రాష్ట్రంలో పెంచిన విద్యుత్,ఆర్టీసీ బస్సు ఛార్జీలను తగ్గించాలని, పెంచిన భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎమ్ ఎల్  ప్రజాపంథా, నాయకులు గోకినేపల్లి ప్రభాకర్, ఎండి సలీం, కల్లయ్య, రఫీ, పిట్టల అర్జున్, చిరంజీవి నాయుడు,రామకృష్ణ, తదితరులు పాల్గోన్నారు.