పీర్జాదిగూడలో వృత్తి విద్యా నైపుణ్యం కోర్సులు ఏర్పాటు : మేయర్ జక్క వెంమేడిపల్లి, జులై14 (ప్రజా

Published: Thursday July 15, 2021
మేడిపల్లి, జులై 14 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పౌరులకు, మహిళలకు వృత్తి విద్యా, నైపుణ్యం కలిగిన కోర్సులను ఏర్పాటు చేయాలనే ఉద్దేశ్యంతో మేయర్ జక్క వెంకట్ రెడ్డి బుధవారం సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్  వేణుగోపాల్ రావుని నగరపాలక సంస్థకు ఆహ్వానించి సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ కొరకు కేటాయించిన కోవిడ్ ఐసోలేషన్ సెంటర్ (పాత పోలీస్ స్టేషన్) భవనంను పరిశీలించారు. అనంతరం మేయర్ చాంబర్లో డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులతో సమావేశమై ట్రైనింగ్ సెంటర్లో ఏర్పాటు చేసే కోర్సుల పై చర్చించారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ వనజ, కార్పొరేటర్లు మద్ది యుగేందర్ రెడ్డి, కె. సుభాష్ నాయక్, కొల్తూరు మహేష్, కుర్ర షాలిని, ఎన్. మధుసూదన్ రెడ్డి, పప్పుల రాజేశ్వరి, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు బొడిగే కృష్ణా గౌడ్, కుర్ర శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.