గీత కార్మికులకు తెరాస ప్రభుత్వం అండగా ఉంటుంది చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

Published: Monday November 21, 2022

కొడిమ్యాల, నవంబర్ 20 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండలం పూడూరు గ్రామానికి చెందిన చల్లూరి శ్రీనివాస్ గౌడ్ గత రెండు నెల క్రితం గీత వృత్తిలో భాగంగా తాడిచెట్టు ఎక్కే క్రమంలో మోకు జారి గాయాలు కాగా తెలంగాణ తాడి టాఫర్ కార్పొరేషన్  సొసైటీ నుండి ఆర్థిక సహాయం గా 15 వేల రూపాయల చెక్కును ఆదివారం రోజున చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్ బూరుగుపల్లి లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బాధితుడు చల్లూరి శ్రీనివాస్ గౌడ్ కు అందజేశారు.
లబ్ధిదారుడు చల్లూరి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్, చొప్పదండి శాసనసభ్యులు సుంకే రవిశంకర్, తాడి టాపర్ కార్పొరేషన్ చైర్మన్ బుర్ర వెంకటేశం గౌడ్ , ఐఏఎస్ కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేనేని రాజనర్సింగారావు, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, కొండగట్టు దేవస్థానం డైరెక్టర్ ఒల్లాల లింగ గౌడ్, సీనియర్ నాయకులు మొగిలిపాలెం రమేష్, అనుమాండ్ల అజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.