జగిత్యాలలో మెడికల్ కాలేజి ఇచ్చిన హామీని నెరవేర్చిన ముఖ్యమంత్రికి పాదాభివందనం - ఎమ్మెల్యే డ

Published: Wednesday May 19, 2021
జగిత్యాల, మే 18, (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లాలో మెడికల్ కళాశాల కేటాయింపుపై తెరాస నాయకులు కార్యకర్తలు జగిత్యాల జిల్లా ప్రజల చిరకాల కోరికైన మెడికల్ కళాశాల కేటాయింపును హర్షిస్తూ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ మాట్లాడుతూ జగిత్యాల ప్రజా ఆశీర్వాద సభకు హాజరైన ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి మెడికల్ కళాశాల మంజూరు చేశారని మౌళిక వసతుల కల్పనకు సైతం ఎంత ఖర్చైన వెనక్కి రాకుండ చూడలని పేర్కొనటంపై ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. నాటి ప్రభుత్వ హాయంలో నర్సింగ్ కళాశాల మంజూరైన నిధులు లేక ఆగిపోయిందని అనంతరం నాటి ఎంపీ ప్రస్తుత ఎమ్మెల్సీ కవిత చొరవతో 10 కోట్లు మంజూరు చేసి అందుబాటులోకి తెచ్చారని అన్నారు. అంతేకాకుండ మాతాశిశు కేంద్రం సైతం త్వరలో అందుబాటులోకి రానుందని కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటికే అధునాతన డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని ప్రారంబించుకున్నామన్నారు. వైరాలజీ ల్యాబ్ పనులు సైతం యుద్ధ ప్రతిపాదకన సాగుతున్నాయని కలెక్టర్ తో పాటు అధికారులు ఎప్పటికప్పుడు రివ్యూలు నిర్వహిస్తూ త్వరగా పూర్తయ్యేల చర్యలు చేపడుతున్నారని తెలిపారు. జిల్లాను మెడికల్ హాబ్ గా మార్చేల చర్యలు తీసుకుంటూ మౌలిక వసతులకై నిధులందిస్తు అండగ నిలుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎమ్మెల్యే పాదాభివందనాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు గట్టు సతీష్ ఎంపీపీ రాజేంద్రప్రసాద్ జిల్లా యూత్ అధ్యక్షుడు దావా సురేష్ భోగ ప్రవీణ్ వైస్ ఛైర్మన్ గోలి శ్రీనివాస్ వైస్ ఎంపీపీ సొల్లు సురేందర్ కౌన్సిలర్లు పిట్ట ధర్మరాజు రైతు బంధు మండల కన్వీనర్ రవీందర్ రెడ్డి చుక్క నవీన్ కూతురు రాజేష్ సారంగాపుర్ మండల అధ్యక్షుడు రాజేందర్ రెడ్డి వడ్డెర సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మోగిలి మైనార్టీ రాయికల్ అధ్యక్షుడు ఇంతియాజ్ కూతురు శేఖర్ అడువల లక్ష్మణ్ సర్పంచులు చెరకు జాన్ గంగాధర్ లక్ష్మణ్ రావు నాయకులు అదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.