గ్రామీణ వైద్యులకు వైద్య విధానాలపైన అవగాహన సదస్సు

Published: Thursday December 29, 2022

బోనకల్, డిసెంబర్ 28 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలో మేఘ శ్రీ హాస్పిటల్ ఎదురుగా నూతనంగా నిర్మించబడిన అగాపే హోలిస్టిక్ న్యూరో క్లినిక్ డాక్టర్ సుబ్రహ్మణ్యం స్పైన్ తెరపి ఆయుర్వేద డాక్టర్ నాగేశ్వర రావు ఇద్దరు కలిసి గ్రామీణ వైద్యులకి ఆయుర్వేదము హోమియో వినాలి స్పైసి మీద ఎలాగా ఫస్ట్ టైం ట్రీట్మెంట్స్ ,ఎలా చేసుకోవాలో వాళ్ళకి శిక్షణ తరగతులు బుధవారం నిర్వహించటం జరిగింది. పేషెంట్లు గ్రామీణ వైద్యులపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు.కనుక పేషంట్లకి వాళ్ళ డబ్బులు వ్యర్థం కాకుండా వాళ్ళ రోగాలని నిర్ధారణ సింపుల్ వేలో డాక్టర్ సుబ్రహ్మణ్యం రాసిన రెండు బుక్స్ లో ఉన్న సారాంశం మీద ఎలాగైతే మనం ట్రీట్మెంట్ చేసుకోవాలో దాన్ని అవగాహన కల్పించి ఎవరికి వాళ్లు వైద్యం చేసేలాగా గ్రామీణ వైద్యులకి వాళ్లకి శిక్షణ తరగతులు జరుపబడ్డాయి. ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా అధ్యక్షులు, బి, కొండలరావు, కిషోర్, హాసన్, రాజారత్నం, కర్ణం, అప్పారావు తదితరులు పాల్గొన్నారు.