తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగ డిమాండ్ బలపరుస్తూ నిరాహార దీక్ష

Published: Thursday February 24, 2022
మధిర ఫిబ్రవరి 23 ప్రజాపాలన ప్రతినిధి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ రాష్ర్ట కార్యాలయం వద్ద తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు శ్రీ బక్కని నరసింహులుగారి అధ్యక్షతన నిరుద్యోగుల డిమాండ్స్ ను బల్లపరుస్తూ నిరుద్యోగులకు ఉద్యోగకల్పన గావించాలని సంఘీభావం దీక్ష నిర్వహించ బడినది ఈ దీక్షలో టీడీపీ పొలిట్బ్యురో సభ్యులు సెంట్రల్ కమిటీ సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు పార్లమెంట్రీ కమీటీ స బ్యులు మండల టీడీపీ అధ్యక్షులు అనుబంధసంఘాలప్రతినిధులు ఇతర ముఖ్య నాయకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని మాట్లాడారు  ఈ దీక్ష లో పాల్గొన్న టిడిపి ఉపాధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాధం మాట్లాడుతూ రాష్ట్ర పీఆర్ సి నివేదిక ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో నాలుగు లక్షల ఉద్యోగుల అవసరం ఉందని ఉన్నవి పోగా ఇంకా ఒక లక్షా 91 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదికలో చెప్పారని కాన వెంటనే తదనుగుణంగా ఖాళీలను భర్తీ చేసేందుకు నోటీఫికేషన్స్ వెంటనే ఇచ్చి రాష్ట్ర అవతరణకు ప్రాణాలు అర్పించిన కుటుంబాలను దృష్టినందుంచుకొని అయినా మరిన్ని నిరుద్యోగుల బలవన్మరణాలు సంభవించకుండా వారి సమస్యలను తాత్సారం చేయకుండా పరిష్కరించాలని టిడిపి తరపున డిమాండ్ చేశారు భర్తీ చేసే గడువులోపల హామీ నిచ్చిన విధంగా ఒక్కక్కరికి 3500 రూపాయల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు నిరుద్యోగుల డిమాండ్స్ నెరవేరే అంతవరకు టీడీపీ పోరాడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు రామనదంతో పాటు రాష్ర్ట టీడీపీ కార్యదర్శి చేకూరి శేఖర్ బాబు రాష్ట్ర తెలుగు యువత కార్యదర్శి మైనీడు జగన్మోహన్ రావు బోనకల్, మధిర మండలాల టీడీపీ అధ్యక్షులు రావుట్ల సత్యనారాయణ మార్నీడు పుల్లారావు ఖమ్మం పరిధిలోని రాష్ట్ర జిల్లా మండల అనుబంధ టీడీపీ నాయకులు దీక్షలో పాల్గొన్నారు కార్యక్రమం జయప్రదం చేశారు