పాఠశాల విధ్యార్థులకు ముమ్మరంగా టీకాలు

Published: Tuesday March 22, 2022
మధిర మార్చి 21 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు ఆజాద్ రోడ్ ఉన్న నారాయణ స్కూల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున పిహెచ్సి వైద్యులు డా శశిధర్ సూచనల మేరకు పలు హైస్కూల్స్ నందు 12 నుంచి 14 సంవత్సరాల పిల్లలకు కార్బో వాక్సిన్ కోవిడ్వాక్సిన్పార మెడికల్ సిబ్బంది ద్వారా ఏర్పాటు చేసి టికాలు వేసి ఆన్లైన్ చేసినారు. మధిర టౌన్ లో గర్ల్స్ హైస్కూల్ నారాయణ స్కూల్ టీవిఎం స్కూల్ సిపియస్ స్కూల్ ఇల్లూరు హైస్కూల్  చిలుకూరు హైస్కూల్ నందు విద్యార్థిని, విద్యార్థులకు కార్బో వాక్సిన్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమంను పిహెచ్సి దెందుకూరు పబ్లిక్ హెల్త్ నర్స్ రమాదేవి, హెచ్ఎస్ సుబ్బలక్ష్మి హెల్త్ విజిటర్ బి కౌశల్య హెచ్ఈఒ ఎస్ గోవింద్ హెచ్ఎస్ లంకా కొండయ్య ఆయా స్కూల్ హెచ్ఎం లు మరియు ఉపాధ్యాయ లు పారామెడికల్ సిబ్బంది ఎఎన్ఎమ్ జయమ్మ, భారతి, విజయ కుమారి, విజయలక్ష్మి వై లక్ష్మి, నాగమణి అరుణ రాజేశ్వరి విజయకుమారి సునీలారాణి హెల్త్ అసిస్టెంట్ లు గుర్రం శ్రీనివాస్ ఎస్ నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.